ధైర్యంగా ఉండటమే బలం
‘మనస్విని’ ప్రతి శనివారం

మేడమ్! నా వయసు 38 సంవత్సరాలు. మా పిల్లలు ఇద్దరూ వేరే ఊరిలో ఉద్యోగం చేస్తున్నారు. నాకు చిన్నప్పుడే పెళ్లయింది. ఇప్పుడు ఈ లాక్‌డౌన్‌లో ఎంతో ఆందోళనకు గురవ్ఞతున్నాను.
మా పిల్లలు ఎలా ఉన్నారో అని. నాకు కూడా ఇంట్ల ఏమీ పాలు పోవడం లేదు. పని పెద్దగా లేదు.
కాలక్షేపం లేదు. అందువల్ల టివి చూస్తూ చాలా ఆందోళనకు గురవ్ఞతున్నాను. ఏమి చేస్తే నేను మరల మామూలుగా ఉండగలను? – శ్రీవిద్య
మీరు తప్పక బాగయిపోతారు. ముందుగా ఈ ఆందోళన నుండి బయట పడండి. ధైర్యంగా ఉండండి. ధైర్యే సాహసే లక్ష్మి అని అంటారు. ధైర్యంగా ఉంటే చాలా బలంగా ఉంటారు.
అదే ఆందోళనతో బలహీనమైపోతారు. బలహీనతతో చాలా జబ్బులు కూడా వచ్చేస్తాయి. అందువల్ల మీరు ఆనందంగా, శాంతిగా ఉండాలి.
ప్రశాంతంగా గడపాలి. మంచి, మంచి ఉత్సాహాన్ని కలిగించే పనులు చేసుకోవాలి. మీ పిల్లలతో ఫోనులో మాట్లాడుకోవచ్చు.
టివిలో మంచి, మంచి కార్యక్రమాలు చూడవచ్చు. మంచి, మంచి పుస్తకాలు చదవవచ్చు. ధ్యానం చేసుకోవచ్చు.
సూక్తులు వినవచ్చు. మంచి హాబీలతో ఎంతో ఆనందంగా గడపవచ్చు. మీరు మీ జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లో ఉంటే మీకు ఏమీ కాదు. ఏ జబ్బులూ రావ్ఞ. ప్రశాంతత, ఆనందం అనేవి అవసరాలు. కోరికలు కాదు.
అందువల్ల ఎల్లప్పుడూ ఆనందంగానే ఉండాలి. సమస్యలు అనేవి మనం సృష్టించుకొన్నవే. ఆనందం, ఉత్సాహం మనం మనకే సృష్టించుకోవాలి. సానుకూలంగా ఆలోచించాలి.
ప్రతిరోజు పండుగ లాగా జరుపుకోవాలి. ప్రతినిత్యం ప్రశాంతతతో, సంతృప్తితో, కృతజ్ఞతతో గడపాలి. ఇది తప్పనిసరి.
జీవన నైపుణ్యాలు నేర్చుకోవాలి
మేడమ్! నా వయసు 55 సంవత్సరాలు. మాకు ఇద్దరు పిల్లలు. అమ్మాయిలు. ఇంకా పెళ్లిళ్లు చేయాలి. నాకు ఈ మధ్యనే ఉద్యోగం పోయింది. కంపెనీ నష్టాలలో ఉందని తీసేసారు. మా ఆయనకు సంపాదన లేదు. చిన్న వ్యాపారం చేస్తాడు.
అది ఏమంత బాగా లేదు. ఈ పరిస్థితిలో నేను ఏం చెయ్యాలో తెలియటం లేదు. కష్టాలన్నీ ఒక్కసారే వచ్చేసాయి. అద్దె కూడా సరిగా కట్టలేకపోతున్నాము.
పనిదొరకటం లేదు. ఆర్ధికంగా కుంగిపోతున్నాము. ఏం చేస్తే మేము మరల బాగా ఆర్ధికంగా స్థిరపడగలం? కొంచెం వివరించండి. సరస్వతి
ముందుగా మీరు ఆత్మవిశ్వాసంతో ఉండండి. ఏ సమస్యనైనా సమర్ధంగా పరిషరించుకోగల సామర్థ్యం మీలో ఉంటుంది. దానిని వెలికి తీయండి. సమస్యలు మన ఆలోచనలలోనే ఉంటాయి.
ఎప్పుడైతే ఆలోచనలు సానుకూలంగా ఉంటాయో అప్పుడే సమస్యలన్నీ తొలగిపోతాయి.
ధైర్యంగా, ఆత్మస్థయిర్యంతో అడుగులు ముందుకు వెయ్యాలి.
ఉద్యోగం తప్పక దొరుకుతుంది. స్నేహితుల, బంధువ్ఞల సహాయం తీసుకోవచ్చు.
ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు అందిపుచ్చుకోవచ్చు.
స్వయంగా కుటీర పరిశ్రమలు నడుపుకోవచ్చు. ఆర్ధికంగా తప్పక నిలదొక్కుకోవచ్చు. కనీస అవసరాలు చాలా తక్కువగా ఉంటాయి.
జీవితం సరళమైంది. దానిని క్లిష్టంగా చేసుకోవచ్చు. ఆనందమైన, సరళమైన జీవితాన్ని గడపాలి.
అన్నింటికీ మించింది ఆత్మవిశ్వాసం, ఆత్మస్థయిర్యం, విశ్వాసం ఉంటే ఏ పనైనా సఫలీకృతమవ్ఞతుంది.
జీవన నైపుణ్యాలు నేర్చుకోవాలి. అవసరాలను తప్పక తీర్చుకోవాలి.
కోర్కెలను తీర్చుకోనవసరంలేదు. జీవితం అమూల్యమైనది. దానిని సఫలీకృతం తప్పక చేసుకోవాలి.
- డాక్టర్ ఎం. శారద, సైకాలజీ ప్రొఫెసర్
తాజా అంతర్జాతీయ వార్తల కోసం :https://www.vaartha.com/news/international-news/