కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలతో సమావేశం ప్రారంభం

The meeting with the chief leaders of the Congress party began

హైదరాబాద్‌ ః రాష్ట్ర ఇంఛార్జి మానిక్కం ఠాగూర్ అధ్యక్షతన పార్టీ ముఖ్య నేతల సమావేశం ఈరోజు గాంధీభవన్‌లో ప్రారంభమైంది. గత రెండు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన రచ్చబండ కార్యక్రమం ప్రోగ్సెస్‌పై చర్చ జరుగనుంది. రచ్చబండ కార్యక్రమంపై ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇంఛార్జి ఠాగూర్‌కు సునీల్ కనుగోలు ఇచ్చిన రిపోర్టుపైనే ప్రధానంగా చర్చ జరుగనుంది. రచ్చబండ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేసిన నేతలను హెచ్చరించే అవకాశం ఉంది. ఈ సమావేశానికి పీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్‌లు, అన్ని జిల్లాల డీసీసీలు, పార్టీ వైస్ ప్రెసిడెంట్‌లు హాజరయ్యారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/