‘ది వారియర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ – ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి జంటగా తమిళ డైరెక్టర్ లింగుసామి డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ‘ది వారియర్’. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రేపు హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్స్ లో జరపనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకాబోతుందని అధికారిక ప్రకటన చేసారు. మరి ఈ వేడుకకు ఎవరెవరు హాజరువుతారనేది చూడాలి.

ఇక ఇప్పటివరకు రిలీజ్ అయినా సాంగ్స్ , టీజర్ , ట్రైలర్ సినిమా ఫై అంచనాలు రెట్టింపు చేసాయి. ఖచ్చితంగా రామ్ కెరియర్ లో ఓ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలువడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం పై శ్రీనివాస చిట్టూరీ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఆది పినిశెట్టి ప్రతినాయకుడుగా కనిపిస్తుండగా, దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తున్నారు.