ది ఘోస్ట్ మూవీ టాక్

కింగ్ నాగార్జున నటించిన తాజా చిత్రం ‘ది ఘోస్ట్’. స్పై నేపథ్యంలో గరుడ వేగ ఫేమ్ ప్రవీణ్ సత్తార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ దసరా కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి బరిలో నాగ చైతన్య తో కలిసి ‘బంగార్రాజు’ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్న నాగ్..ఇప్పుడు ‘ది ఘోస్ట్’ సినిమాతో వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా నటించింది. మార్క్ కే రాబిన్ దీనికి సంగీతం ఇచ్చారు.

ఇక ఈ చిత్రాన్ని చూసిన అభిమానులు , సినీ లవర్స్ సినిమా ఎలా ఉందనేది సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ‘అద్భుతమైన కథ, మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్స్‌తో సినిమా అదిరిపోయింది. అక్కినేని నాగార్జున 1980 రోజులను మరోసారి గుర్తు చేసారని అంటున్నారు. ఇది మైండ్ బ్లోయింగ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. దసరా విన్నర్ అని చెప్పొచ్చు అని మరికొంతమంది అంటున్నారు. యాక్షన్ సీక్వెన్స్‌లు, కథ ఈ సినిమాను పర్‌ఫెక్ట్‌గా మార్చాయి. నాగార్జున తన స్వాగ్‌తో వన్ మ్యాన్ షో చేశారు. ప్రవీణ్ సత్తారు సినిమాను కాస్త స్పైసీగా తెరకెక్కించాడు. కింగ్ ఈజ్ కింగ్’ అంటూ పోస్ట్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఘోస్ట్ మూవీ కి పాజిటివ్ టాక్ రావడం తో అంత హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు.