స్వాతి ముత్యం మూవీ టాక్

Swathi mutyam movie talk

బెల్లం కొండ గణేష్ హీరోగా .. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గణేష్ హీరోగా యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం స్వాతి ముత్యం. వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ చిత్రంతో.. లక్ష్మణ్.కె. కృష్ణ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈరోజు దసరా సందర్బంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

వీర్యదానం అనే ఎమోషనల్ పాయింట్ చుట్టూ కుటుంబ విలువలు, బంధాలు, అనుబంధాలతో ఈ చిత్రాన్ని డైరెక్టర్ కృష్ణ తెరకెక్కించారు. మన ఇంటిలో జరిగే సంఘటనలు.. మన కుటుంబంలో ఉండే మనుషుల మధ్య సినిమా చూస్తున్నామా? అనే ఫీలింగ్ సినిమా చూస్తున్నంత సేపు కలుగుతుంది. డైరెక్టర్ సెకండ్ హాఫ్ లో కథను డీల్ చేసిన విధానం..కథను నడిపించిన తీరు.. పాత్రలను డిజైన్ చేసిన తీరు సినిమాను సక్సెస్ బాటలో నడిపించడానికి దోహదపడ్డాయి. పండుగ సమయంలో ఫ్యామిలీ అంతా హ్యాపీగా వినోదాన్ని ఆస్వాదించానికి ఆస్కారం ఉన్న చిత్రం స్వాతిముత్యం అని సినిమా చూసిన వారు చెపుతున్నారు. సినిమా ఫస్టాఫ్ అంతా హీరో, హీరోయిన్.. వారి రెండు కుటుంబాలు. హీరోయిన్ పెళ్లికి ఒప్పుకోక‌పోతే హీరో అమెను ఒప్పించే స‌న్నివేశాలు.. మాంటేజ్ సాంగ్స్‌తో న‌డిచిపోతుంది. ఫ‌స్టాఫ్ గొప్ప‌గా లేక‌పోయినా బోరింగ్‌గా కూడా లేదు. అలా న‌డిచిపోతుంది. ఇక ట్విస్ట్‌తో ఇంట‌ర్వెల్ వ‌స్తుంది. ఇక సెకండాఫ్‌లో పాత్ర‌లు, స‌న్నివేశాలు, త‌ద‌నుగుణంగా వ‌చ్చే కామెడీ ప్రేక్ష‌కుడిని న‌వ్విస్తాయి అని చెపుతున్నారు. ఓవరాల్ గా స్వాతి ముత్యం పండగ పూట ఫ్యామిలీ సభ్యులతో హ్యాపీ గా చూసే మూవీ అని అంటున్నారు.