జార్జియా రాష్ట్ర ఫలితం కీలకం
అధ్యక్ష పీఠానికి దిశానిర్దేశం

Washington: అమెరికా ఎన్నికల ఫలితాల్లో జార్జియా రాష్ట్ర ఫలితం కీలకంగా మారనుంది.
ఎకాఎకిన 18 ఎలక్టోరల్ ఓట్లు కలిగిన ఇక్కడ ఎవరు విజయం సాధించబోతున్నారనే విషయం కడు ఆసక్తికంగా ఉంది..
భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్యానికి ట్రంప్ 23.9 లక్షల ఓట్లు (50.3శాతం) విజయం సాధించగా, జో బైడెన్ 23.03 లక్షల ఓట్లు (48.5శాతం) ఓట్లు విజయం సాధించారు.
ఇక్కడ ఇంకా 2 లక్షల ఓట్లను కౌంట్ చేయాల్సి ఉంది.
ఇక్కడి రాష్ట్రంలో విజయ సాధించినవారు మరో 16 ఎలక్టోరల్ ఓట్లు పొందనున్నారు.. ప్రస్తుతం డెమోక్రాట్ 227, రిపబ్లికన్ 213 ఎలక్టోరల్ ఓట్లు గెల్చుకున్నాయి.
గెలుపునకు కావాల్సిన 270 ఎవరు సాధిస్తారో వారికి అధ్యక్ష పీఠం దక్కనుంది.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/