గుణపాఠం నేర్చుకోకపోతే భవిష్యత్‌ ప్రశ్నార్థకమే

ఎడారి ప్రాంతాల నుంచి మిడతల దండు విలయతాండవం

Locusts on roads
Locusts on roads

ఆఫ్రికా ఖండంలోని ఎడారి ప్రాంతాల నుంచి వ్యాపించిన మిడతల దండు విలయతాండవాన్ని సృష్టిస్తున్నాయి.

వీటి ప్రభావ పరిణా మాల మూలంగా ప్రపంచ ఆహారోత్పత్తికి ఆటంకం జరగనుందని ప్రపంచ ఆహార భద్రత ప్రమాదంలో పడి కోట్లాది ప్రజలు ఆహార కొరత.

బీకర ముప్పు పొంచి ఉందని, ఆసియా దేశాలకు ప్రపంచ ఆహార సంస్థ ప్రభావిత దేశాలను అప్రమత్తం చేస్తుంది.

అలాగే వీటిని నిర్మూలించేందుకు అత్యవసర కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఐక్యరాజ్యసమితి ఇటీవలే భారత్‌కు సూచించడంతో నియంత్రణ చర్యల్లో వేగం పెంచడంలో భాగంగా రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది.

ప్రకృతిలో ప్రతిదీ సహజం గానే జరిగిపోయేలా ఏర్పా టు ఉంది. మానవుడు పుట్టడం, ప్రకృతితో కలిసి జీవించడమే తన కర్తవ్యంగా భావించాలి.

పంచభూతా లైన గాలి,నీరు, నింగి, నేలా,నిప్పు వీటి సమతౌల్యతకు విఘాతం కలగ కుండా జీవనం సాగించాలి.

వ్యక్తుల నుండి వ్యవస్థల వరకు ఈ నియ మాన్ని పాటించని ఫలితమే ఇప్పుడు సంభవిస్తున్న విపత్కర పరిణామాలకు మూలకారణం.

ప్రపంచ దేశాలను కరోనా వైరస్‌ గడగడలాడిస్తుంది. ఈ విపత్తు నుండి మానవాళి కోలుకోకముందే మనదేశంలో మరో పెద్ద సమస్య వచ్చిపడింది.

మిడ తల దండువాయువేగంతో ప్రయాణిస్తూ పంట పొలాల నష్టంతో దుర్భిక్షం తప్పదని ఇతర దేశాల పరిణామాలను బట్టి తెలుస్తుంది.

ఈ మిడతల దండు ఇతర వలస కీటకాలతో పోలిస్తే అత్యంత ప్రమాదకరమైనవని ఐక్యరాజ్యసమితి ఆహార, సేద్య సంస్థ ధృవీక రించింది.

కర్ణాటక, ఢిల్లీతోపాటు రెండు తెలుగు రాష్ట్రాలకు పెను ముప్పు .

మిడతల దండు వాలిందంటే అక్కడి గడ్డి, ఆకులు, పంటలు మొత్తం పచ్చదనమే స్వల్ప సమయంలో హరించిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ మిడతలు మూడు నెలల్లో తమతమ సంతతిని 20 రెట్ల వరకు పెంచుకుంటాయి. ఒక పెద్ద మిడత రోజుకు తన బరువ్ఞకు సమానమైన తిండి తింటుంది.

ఒక 10 ఏనుగులు, 25 ఒంటెలు, లేదా 2500 మంది మనుషులు ఒక రోజులో తినే ఆహారాన్ని ఓ చిన్నస్థాయి గుంపు తినేస్తుంది. ఒక చదరపు కి.మీ దండులో 8 కోట్ల వరకు మిడతలు ఉంటాయి.

మనదేశంలో కనిపించే దండు గరిష్టంగా 135-150 కి.మీ వరకు ప్రయాణిస్తాయని నిపుణులు చెపుతున్నారు.

వాతావరణ మార్పులే గత ఏడాది వర్షాకాలం దీర్ఘకాలంగా కొనసాగడం, తుఫాను రావడం వలన వీటి సంఖ్య భారీగా పెరిగినట్లు భావిస్తున్నారు.

అయితే మన తెలంగాణ రాష్ట్రంలోకి రాకుండా సరిహద్దుల్లోనే కట్టడి కోసం 15వేల లీటర్ల రసాయన ద్రావణాలు సిద్ధం చేసి పర్యవేక్షణకు అధికారులతో కమిటీ వేసి నిరంతరం హెలికాప్టర్‌ ద్వారా పరిశీలనకు పూనుకున్నారు.

మనకు వచ్చే అవకాశం తక్కు వగా ఉన్నప్పటికీ 15వేల లీటర్ల మలాతియాన్‌, క్లోరోఫైరిపాస్‌, లామ్డా సైలోబ్రిన్‌ ద్రావణాలను, 12 అగ్నిమాపక, 12 జెట్టింగ్‌ యంత్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది .

ఇప్పుడు వర్షాకాలం పంటలు సాగు చేసేవేళ ఇలా కరోనా, మిడ తల దాడులలో రైతాంగానికి తీవ్ర నష్టముంది. ఆఫ్రికా ఖండం లోని ఎడారి ప్రాంతాల నుంచి వ్యాపించిన మిడతల దండు విలయ తాండ వాన్ని సృష్టి స్తున్నాయి.

107 దేశాల అంతర్జాతీయ ఆకలిబాధ సూచీలో 102వ స్థానంలో నలిచి దేశం అప్రతిష్టను మూటగట్టుకుంది. కరోనా దుష్ప్రభావంతో దేశ ఆర్థిక వ్యవస్థ కకావికలం చేసింది.

దీని ప్రభావంతో 40 కోట్లమందిని పేదరికం లోకి నెట్టివేయబడు తుందని తెలుస్తుంది.

మరో వైపు ఆహారం ఆరోగ్యం ఈ రెండూ అత్యంత కీలక ప్రాధాన్యాంశా లుగా ప్రజలు పాలకులు భావిస్తున్నారు.

బియ్యం, పప్పులు, కూరగాయలు మొదలగు వాటి అన్నింటిపైన పిచుకారు చేస్తున్న పలు రకాల విషపూరిత రసాయన పురుగు మందులను నిషేధించాలని ప్రభుత్వాలు భావి స్తున్నాయి.

కార్బాప్యూరాన్‌ వినియోగంపై 63 దేశాలు, డైకోఫా లోని 45 దేశాలు, మేథోపోల్‌ని 41 దేశాలు, ఏసోఫేట్‌ను 32 దేశాలు, క్వినాల్‌పాస్‌కు 30 దేశాలు నిషేధాజ్ఞలు విధించాయి.

వీటి మూలంగా వివిధ దేశాల్లో ఏటా సుమారు రెండు లక్షల నిండు ప్రాణాలు కోల్పోతున్నారని ఐక్యరాజ్యసమితి తెలిపింది.

ఎండో సల్ఫాస్‌, మోనోక్రోటోఫాస్‌, ఆక్సిఫ్లోరోఫెస్‌ పూర్తిగా స్తంభింప చేయాలి. కూలీల కొరత మూలంగా కలుపు మొక్కల నివారణకు వాడే గైఫ్లోసెట్‌ పంటలు విషాహారంగా మారి ప్రజల ఆరోగ్యానికి తూట్లు పొడుస్తుంది.

భూసారానికి జలకాలుష్యానికి కారణమవ్ఞ తుంది. ఈ విపత్కర పురుగు మందుల వాడకంతో ఆహారం కలుషితమై ప్రజానీకం అనారోగ్యాలపాలవ్ఞతున్నారు. కాలం నిత్యం మారుతూనే ఉంటుంది. కాని మనం చేసే మంచి, చెడులు మారవ్ఞ.చెడ్డపని వెంటాడుతూనే ఉంటుంది. మంచిపని కాపాడుతూనే ఉంటుంది.

-మేకిరి దామోదర్‌

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/