డ్రాగన్‌ ఫ్రూట్‌ రుచి చూడాల్సిందే

The Dragon Fruit

ఈ మధ్య కాలంలో ప్రపంచదేశాలతో పాటు భారత్‌లోను ఎక్కువగ కనిపిస్తున్న పండ్లలో డ్రాగన్‌ ఫ్రూట్స్‌ కూడా ఉంటున్నాయి. వీటి ప్రయోజనాల్ని గుర్తించిన రాష్ట్రాలు వీటి సాగుకు కృషి చేస్తున్నవి. చిరు వ్యాపారులు కూడా ఈ పండ్లను అమ్ముతున్నారు. డ్రాగన్‌ ఫ్రూట్‌ అసలు ఈ పేరే చిత్రంగా అనిపిస్తుంది. డ్రాగన్‌ అనేది చైనాలో పవిత్రమైన జంతువు. అది తన నోటి ద్వారా అగ్నిజ్వాలలు రగిలిస్తూ శత్రువుల్ని సంహరిస్తుందని, అలాంటి డ్రాగన్స్‌ ఇప్పటికీ ఉన్నాయని చైనీయులు నమ్ముతారు.

మరి ఆ పేరును ఈ పండ్లకు ఎందుకు పెటారంటే వీటి ఆకర్షణీయమైన రంగు, రూపురేఖలవల్ల. ఎన్ని పండ్లు ఉన్నా డ్రాగన్‌ పండ్లను ఇట్టే గుర్తించగలం. గులాబీ రంగులో ఉండే ఈ పండుకి చుట్టూ ఉన్న రేకులు పసుపు, పచ్చరంగులో ఉంటాయి. ఇది దక్షిణ అమెరికాలో పుట్టింది. తూర్పు ఆసియాకు విస్తరించింది. థా§్‌ులాండ్‌, వియత్నాం ప్రజలకు ఈ పండ్లంటే విపరీతమైన ఇష్టం. బరువు తగ్గాలనుకునే వారికి డ్రాగన్‌ ఫ్రూట్స్‌ బెస్ట్‌ పండ్లు అని చెప్పవచుచ. ఎందుకంటే ఇందులో ఎక్కువ కేలరీలు ఉండవు. ఇందులోని గుజ్జు తెలుపురంగులో ఉంటుంది. మధ్యలో గింజలుంటాయి. ఇవి అరటిపండ్లలో గింజల్లా ఉంటాయి.

అందువల్ల ఈ పండును తినేవారు గింజలతో సహా తింటారు. కరకరలాడే ఆ గింజలు అందరికీ నచ్చుతాయి. ఈ మధ్య ఈ పండ్లలో కూడా రకాలు వచ్చాయి. లోపల గుజ్జు కూడా గులాబీ రంగులోనే ఉండేలా మార్పులు చేశారు. డ్రాగన్‌ పండ్లలో విటమిన్‌ సి, ఇ పెద్ద మొత్తంలో ఉంటాయి. అలాగే ఐరన్‌, మెగ్నీషియం కూడా ఎక్కువే. అందువల్ల ఈ పండ్లు ఎంత తింటే అంత చురుకుగా మారతారు. చాలా శక్తి వస్తుంది. సంపూర్ణ ఆరోగ్యానికి ఈ పండ్లు ఎంతో మంచివి. డ్రాగన్‌ ఫ్రూట్స్‌లో అరిగిపోయే ఫైబర్‌ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది.

మలబద్ధకాన్ని నివారిస్తుంది. గుండెకు కూడా ఈ పండ్లు మంచివే. బాడీ మెటబాలిజంకి ఈ పండ్లు బాగా ఉపయోగపడతాయి. డ్రాగన్‌ పండ్లలో ప్రీబయోటిక్స్‌ ఉంటాయి. ఇవి పొట్ట, పేగులు, అన్నవాహికను బాగుచేస్తాయి. క్లీన్‌ చేస్తాయి. డ్రాగన్‌ పండ్లలో బెటాలైన్‌, కెరొటెనాయిడ్స్‌ ఉంటాయి. ఇవి మనకు కాన్సర్‌ రాకుండా అడ్డుకుంటాయి. ఒక్కో పండు 400 గ్రాముల బరువు ఉంటుంది. ఇవి కొద్దిగా పుల్లగా, కొద్దిగా తీపిగా ఉంటాయి. మరీ ఎక్కువ తీపిదనం ఉండవు. ఒక్క మాటలో చెప్పాలంటే తాటి ముంజల రుచి లాగే ఉంటుంది. వీటి బదులు తాటి ముంజలే తింటే సరిపోతుంది అని కూడా అనిపించవచ్చు. వేటి ఆరోగ్య ప్రయోజనాలు వాటికి ఉంటాయి. సీజన్‌లో వచ్చే ఫ్రూట్స్‌ని కూడా రుచి చూడాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/