పిల్లలకు ఆర్థిక పాఠాలు

పిల్లలకు ఆర్థిక పాఠాలు
Financial lessons for children

పిల్లలు అడిగింది కొనిపెడతాం. కాస్త పెద్దయ్యేకొద్దీ పాక్‌ట్‌మనీ ఇస్తాం. వాళ్లకు డబ్బు వ్యవహారాలు అలవాటు చేస్తాం. అన్నీ మంచివే. కాన వాళ్లకు డబ్బు విలువ తెలిచేస్తున్నామా అనే కోణంలో ఆలోచించాలి. రకరకాల కారణాలతో ఆర్ధికావాగాహన లోపంతో పిల్లలు తల్లిదండ్రుల్ని బాధపెట్టడం ఈ రోజుల్లో చాలా ఇళ్లలో కనిపిస్తోంది. చాలామంది తల్లిదండ్రులు తలకు మించిన భారమైనా సరే పిల్లలు అడిగిందల్లా చేస్తారు. కానీ పిల్లలేమో తమకా స్థోమత ఉందనుకుంటారు. అదే సమస్యలు తెచ్చిపెడుడుతోంది. డబ్బు వ్యవహారం పిల్లలకు ఎందుకు అని తల్లిదండ్రులు ఆనుకోవడమే దీనికి మూల కారణం. నిజానికి వారికి ఆర్థిక వ్యవహారాల గురించి తప్పక తెలియాలి. తల్లిదండ్రుల పరిస్థితి, కుటుంబం, పిల్లల కోసం పడుతున్న కష్టం గురించి తెలియడం అవసరం. పొదుపుపైనా అవగాహన పెంచాలి. ఎక్కడ ఆదా చేయాలి. వృధా ఎక్కడ అవుతుంది. వంటివి వివరించాలి. అప్పుడే వారు భవిష్యత్తులో పొదుపుపై దృష్టిపెడతారు. లేదంటే పిల్లలు చాలా ససమ్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. అందుకే తల్లిదండ్రులు ఆ విషయంలో పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తూ పిల్లలకి మార్గనిర్దేశకులుగా ఉండాలి. అంతకన్నా ముందు వారి వద్ద ఎలా ఉండకూడదో కూడా తెలిసుండాలి. పిల్లల వద్ద ఆర్థిక వ్యవహారాలు దాచి పెట్టకూడదు. పొదుపు గురించి చెప్పకపోయినా ఫర్వాలేదు కానీ అప్పులు గురించి తెలియజేయాలి. వారి చేత ఇంటిపనులు చేయిస్తున్నప్పుడు చిన్న చిన్న లంచాలు ఇవ్వడం సరికాదు. ఇలా చేయడం వల్ల వయసు పెరిగే కొద్దీ వారు ప్రతి పనికీ డబ్బు కావాలని అడగడం మొదలుపెడతారు. బాధ్యతల్ని విస్మరిస్తారు. ప్రతిపని చేయడానికి డబ్బు ఆశిస్తారు. దాంతోపాటు కొందరు తల్లిదండ్రులు పిల్లలు అడగకముందే అన్నీ కొనివ్వాలని ఆశపడుతుంటారు.
ఇది సరైన పద్ధతి కాదు. పాకెట్‌మనీ అవసరం లేకపోయాని ఇవ్వడం లెక్కలు అడగకపోవడం పెద్ద పొరపాటు. పిల్లల ముందు డబ్బుల విషయంలో పెద్దలు గొడవపడకూడదు. దుబారా ఖర్చులు చేయడం, నచ్చాయి కదాని అవసరంలేని వాటిని కొనివ్వడం తగదు. స్థోమతకు మించి విలాసాలూ కల్పించకూడదు. అలానే అతి జాగ్రత్తతో వారికి తెలియకుండానే పెరుగుతారు. చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు సమయం కేటాయించలేకపోతున్నామనే అపరాధ భావనతో వారికి ఏదో ఒకటి కొనిచ్చేస్తుంటారు. ఇది కరెక్టుకాదు. పిల్లలు అమ్మానాన్నలు మాతో గడపం లేదని బాధపడకుండా వారి నుంచి ఏం పొందాలా అని మాత్రమే ఆలోచిస్తుంటారు. అందుకే సాధ్యమైనంత వరకు పిల్లలకు సమయం కేటాయించాలి. వీలుకాని పక్షంలో వారికి ఆ విషయం సూటిగా చెప్పాలి.

తాజా కెరీర్‌ సమాచారం కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/