చికెన్ మసాలా రెసిపీ..
రుచి- వెరైటీ వంటకాలు

వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తే.. మిరియాల చికెన్ మసాలా అవసరం.
చికెన్ కర్రీల్లో వందల రకాలు న్నాయి.
రోజూ కొత్త కొత్త వరైటీల కోసం అంతర్జాతీయ చెఫ్‌లు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. మనం వండిన ప్రతిసారీ చికెటన్ కర్రీ ఒకేలా చేసుకుంటే రోటీన్ అయి పోతుంది. అందుకే ఇవాళ డ్రై మిరియాల చికెన్ మసాలా కర్రీ ఎలా వండుకోవాలో .. దీనిని తయారీలో భారతీయ మసాలా రుచులు కలుస్తాయి.
అందువల్ల ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని రైస్ లేదా నాన్‌తో తీసుకుంటే రుచి మామూలుగా ఉండదు. దీనికి ఐటెమ్స్ ప్రిపేర్ చేసుకోవాలడానికి 10 నిమిషాలు, వండటానికి 30 నిమిషాలు పడు తుందని.
నలుగురి కోసం పండుకోవడానికి సరిపడా కర్రీ ఎలా చెయ్యాలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు :
చికెన్ – 1 కెజి , నేనె 3 టేబుల్ స్పూన్లు
సోంపు – 1 టేబుల్ స్పూన్ , ఉల్లపాయలు-2 పెద్దవి (సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి) పచ్చిమిర్చి – ఆ (మధ్యలోకి కట్ చేసుకోవాలి ) కరివేపాకులు- కొన్ని అల్లం, వెల్లుల్లి పేస్ట్-2 టేబుల్ స్పూన్లు
పసుపు- 1 టేస్పూన్, ధనియాల పొడి-2 టేబుల్ స్పూన్లు
గరం మసాలా పొడి – 2 టీస్పూన్లు ఉప్పు-సరిపడా,
తాజా నల్ల ధనియాలు-2 టేబుల్ స్పూన్లు (పొడి చేసుకోండి)
నిమ్మరంసం – రుచికి సరిపడా, కొత్తిమీర-సరిపడా

తయారీ విధానం :
స్టవ్ ఆన్‌చేసి మీడియ ప్లేమ్‌పెట్టి కడాయిపెట్టి అందులో నూనె వెయ్యండి వేడికాగానే సొంపు గింజలు వేయండి అవి చిటపట శబ్దం చేసేవరకూ ఆగండి.
ఇప్పుడు వెంటనే ఉల్లి ముక్కలు వెయ్యండి కొన్నా క్షణాలకే కరివేపాకులు, వెంటనే పచ్చిమిర్చి వెయ్యండి – 5 నుంచి 10 నిమిషాలు వేపండి. అది గోల్డెన్ కలర్‌లోకి మారాలి.
ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వెయ్యడానికి సరైన సమయం వేఇసి ఓ నిమిషం అటూ ఇటూ కదుపుతూ ఉండండి. తద్వారా అది అడుగున అతుక్కోకుండా ఉంటుంది.
మిగతా పొడులన్నీ (మిరియాల పొడి కాకుండా) వేసి అటూఇటూ కదుపుతూ ఉండండి.
కొన్ని క్షణాలకే చికెన్ ముక్కలు వేసి వాటికి మసాలా పూర్తిగా అంటుకునేలా చెయ్యండి. ఇప్పుడు మూత పెట్టండి.
30-నుంచి 40 నిమిషాలపాటూ.. చికెన్ ఉడకనివ్వాలి. మధ్యమధ్యలో రెండు మూడు సార్లు ముక్కల్ని అటూ ఇటూ కదపడం మర్చిపోవద్దు.
కడాయి మూత తియ్యండి. మంటపెంచి.. మసాలా మొత్తం చికెన్ ముక్కలకు బాగా అంటుకొని అంతా డ్రై అయ్యలా వండండి. అంటే ప్రైచికెన్ లాగా.
ఇప్పుడు కిందకు దించి.. మిరియాల పొడి వేసి కలపండి. కొన్ని క్షణాలకు నిమ్మరసం వేసి కలపండి. చివర్లో కొత్తిమీర చల్లండి చివరగా మరోసారి కలపండి.
ఇది వండేటప్పుటకే ఇల్లంతా ఘమఘుమలు వచ్చేస్తాయి. ఇక ఆలస్యం చెయ్యకండి. వేడిగా ఉన్నప్పుడే ఇంటిల్లిపాదీ తినేయండి అదిరిపోయే టేస్ట్ ఆస్వాదించండి.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/