భగవద్గీత

ఆధ్యాత్మిక చింతన

The Bhagavadgita

శ్రేయన్‌ స్వధర్మో విగుణః పరధర్మాత్‌ స్వనుష్టితాత్‌
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః

ఇది భగవద్గీతలోని 3వ అధ్యాయంలోని 35వ శ్లోకము. దీని అర్ధము బాగా అనుష్టించిన పరధర్మముకంటే గుణహీనమైన స్వధర్మమే శ్రేష్టము. స్వధర్మ ఆచరణలో ప్రాణం పోయినా మేలే. పరధర్మ ఆచరణం భయంకరం.

ఈ శ్లోకాన్ని వ్యాఖ్యానిస్తూ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని నాలుగు వర్ణాలున్నాయని, ఏ వర్ణానికి చెందిన వారు ఆ వర్ణము వారు ఏమి చేయాలని శాస్త్రాలు నిర్దేసించాయో ఆ పనులను చేయటమే వారికి స్వధర్మ ఆచరణ అని చాలా మంది చెబుతుంటారు.

ఏ వర్ణముల ఆరు ఏమి చేయాలో దాన్ని చెబుతారు ఇలా – వేదములను చదువుట, చదివించుట, యజ్ఞము చేయుట, చేయించుట, దానమిచ్చుట, గ్రహించుట బ్రాహ్మణుని కర్మములు.

ప్రజలను పాలించుట, శ్రేష్టులను సత్కరించుట, దుష్టులను శిక్షించుట క్షత్రియుని పనులు. పశుపాలన, వ్యవసాయము, వ్యాపారము, దానధర్మాలు చేయుట వైశ్యుని పనులు. పై మూడు వర్ణాల వారికి సేవ చేయుట శూద్రుల పనులు.

కాబట్టి బ్రాహ్మణుడు చేయవలసిన పని బ్రాహ్మణుడే చేయాలి. శూద్రుడు చేయవలసిన పని శూద్రుడే చేయాలి. అప్పుడే స్వధర్మాన్ని ఆచరించిన వారవుతారు వారు.

శూద్రుని పనిని శూద్రుడు చేసినా పరధర్మానఆశ్రయించిన వారవుతారు. స్వధర్మా న్ని ఆచరిస్తూ ప్రాణం విడిచినా పర్వాలేదు, పరధర్మాన్ని ఆచరించటం భయంకరం అని శ్రీకృష్ణుడు బోధించాడని వారు అంటారు.

ఎందుకంటే బ్రాహ్మణులతో సహా ఎవరూ స్వధర్మాన్ని అనుష్టించక పరధర్మాలనే ఆశ్రయించిన దృశ్యం మన కళ్లముందుంది.

మరికొందరంటారు స్వధర్మాన్ని ఆచరించటమంటే స్వభావానికి అనుగుణమైన పనిని చేపటట్టటమే గానీ కుల వృత్తిని చేపట్టటం కాదని. సరే, అలా చేస్తే ఆ పని చేయటంలో ఆ వ్యక్తికి ఆనందముంటుంది.

మంచిదే. కానీ ఆ ఆనందం, తృప్తి శాశ్వతంగా ఉంటుందా, శాశ్వత ఫలితాన్నిస్తుందా? లేనప్పుడు అది ్వధర్మమెలా అవ్ఞతుంది?

నిప్పు ఒకప్పుడు కాల్చి ఒకప్పుడు కాల్చకపోతే కాల్చటం నిప్పు యొక్క స్వధర్మమని అనగలమా? ఈ వివరణ కొంత వరకు బాగానే ఉంది.

‘నీవు ఆత్మవు, జనన మరణాలున్న దేహం కాదు, బుద్ధి, అహంకారాలవూ కాదు. నీవ్ఞ ఆత్మస్థితిలోనే స్థిరపడి ఉండాలి.

అదే నీ స్వధర్మము. దాన్ని అనుష్టిస్తున్నప్పుడు అంటే నీవు ఆత్మస్థితిలో నిశ్చలంగా ఉన్నప్పుడు నీ శరీరం మరణించినా మంచిదే, ఎందుకంటే పునర్జన్మ ఉండదు.

నీవుఆత్మస్థితిలో ఉన్నప్పుడు నీవుఇతరులను చంపినా, ఇతరులతో చంపబడినా మంచే జరుగుతుంది అన్నది శ్రీకృష్ణుని బోధయై ఉంటుంది.

మనము మన ఆత్మస్థితిలో ఉండక అంటే స్వధర్మాన్ని పాటించక పరోపకారం అంటూ సంఘసేవలో నిమగ్నమయితే అంటే పరధర్మాన్ని ఆచరిస్తే మనకు పుణ్యం, పేరు ప్రఖ్యాతులు రావచ్చు.

అది కూడా భయంకరమే. ఎందుకంటే పునర్జన్మకు దారి తీస్తుంది.

పరమాత్మ నుంచి దూరమైన, విడివడిన మన ఆత్మను పరమాత్మతో చేర్చటమే మన స్వధర్మము, పరమపావనమైన ధర్మము. దానికి తోడ్పడేవే యోగం, ధ్యానం, జ్ఞానం, మౌనం, గానం, నాట్యం. వాటిని సరైన పద్ధతిలో వినియోగించాలి.

– రాచమడుగు శ్రీనివాసులు

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/