అధికారులు అప్రమత్తం

మంత్రి కేటిఆర్ ఆదేశం

TS Minister Ktr
TS Minister Ktr

Hyderabad: సిరిసిల్ల జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు సమన్వయంతో పని చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.

ప్రజలకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వరద ముంపు ప్రాంతాలలో సహాయ చర్యలు చేపట్టాలని సూచించారు..

భారీ వర్షాలు మరో రెండు రోజులు కొనసాగే సూచనలు ఉన్న నేపథ్యంలో మంత్రి జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే, అదనపు కలెక్టర్ అంజయ్య తో ఫోన్ లో మాట్లాడారు. 

ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను అప్రమత్తం చేశారు.

అధికారులు అందరూ స్థానికంగా అందుబాటులో ఉండాలన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/