హీరో విజయ్ ఇంట్లో ఐటీ సోదాలు

Actor Vijay
Actor Vijay

చెన్నై: తమిళ స్టార్ హీరో విజయ్‌ నివాసాల్లో ఐటీ అధికారులు రెండో రోజు సోదాలు చేస్తున్నారు. తన కొత్త చిత్రం మాస్టర్‌ షూటింగ్ కోసం నైవేలిలో ఉన్న విజయ్‌ని చెన్నైకి పిలిపించారు ఐటీ అధికారులు. గతేడాది అక్టోబరులో రిలీజైన బిగిల్‌ సినిమాకి తీసుకున్న రెమ్యునరేషన్‌పై విజయ్ ‌ను ప్రశ్నించారు ఐటీ అధికారులు. ఈ సినిమా నిర్మాణ సంస్థ ఏజీఎస్‌ ఆఫీసుల్లోనూ తనిఖీలు జరిగాయి. ఇవాళ ఉదయమే విజయ్ ఇంటికి చేరుకున్న అధికారులు మొత్తంగా 38 చోట్ల పోదాలు నిర్వహించి రూ.65 కోట్ల నోట్ల కట్టను స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బులకు సంబంధించి ఐటీ అధికారులు విజయ్‌ను ఏడెనిమిది గంటలుగా ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు బిగిల్ సినిమాకు ముందు తీసుకున్న పారితోషకానికి సంబంధించి రకరకాల ప్రశ్నలు వేస్తున్నట్లు తెలిసింది. కాగా విజయ్ నివాసాల్లో ఐటీ నిన్న( బుధవారం ) కూడా పెద్ద ఎత్తున తనిఖీలు చేశారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/