ఉద్యోగికి కృతజ్ఞతలు తెలిపిన మహీంద్రా గ్రూప్ చైర్మన్

ముంబయి: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీల్లో 38 ఏళ్ల పాటు పనిచేసి పదవీ విరమణ చేస్తున్న ఓ ఉద్యోగికి మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా స్వయంగా శుభాకాంక్షలు తెలిపారు. తన తండ్రికి కంపెనీ బాస్‌తో శుభాకాంక్షలు చెప్పించాలన్న ఉద్యోగి కుమారుడి కోరిక నేరవేర్చడానికి ఆయన ఇలా చొరవ తీసుకున్నారు. సరిగ్గా ఆ ఉద్యోగి రిటైర్మెంట్‌కు ముందు ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో తన సందేశాన్ని పోస్టు చేశారు. విలువైన, గొప్ప సహోద్యోగిగా ఉన్నందుకు మీ నాన్నకు థ్యాంక్స్ చెప్పు అని అన్నారు. తాను దీన్ని ఆలస్యంగా చూశాను. అయితే మించిపోయిందేమీ లేదు. సరిగ్గా మూడు నిమిషాలు ముందు మీ నాన్నకు కృతజ్ఞతలు చెబుతున్నాను. తన కొత్త జీవితంలో కూడా ఆయన మరిన్ని సాహసాలు చేయాలని కోరుతున్నాను. మమ్మల్ని మర్చిపోవద్దు. మేమెప్పుడూ మీతోనే ఉంటాం అంటూ ఆనంద్ మహీంద్రా రీ ట్వీట్ చేశారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/