కాంగ్రెస్‌ పార్టీకి ఓటేస్తే అభివృద్ధి ఆగిపోతుంది?

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వని బిజెపికి ఎందుకు ఓటేయ్యాలి!

K. T. Rama Rao
K. T. Rama Rao

వేములవాడ: మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కెటిఆర్‌ వేములవాడలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో లేని కాంగ్రెస్‌ పార్టీకి ఓటేస్తే అభివృద్ధి ఆగిపోతుందని మంత్రి అన్నారు. ఇంకా బిజెపి నేతలకు మాటలు ఎక్కువ పని తక్కువ అని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వని బిజెపికి ఎందుకు ఓటెలయ్యాలని కెటిఆర్‌ ప్రశ్నించారు. రాబోయే నాలుగేళ్లలో తెలంగాణలోని అన్ని పట్టణాలను దేశం ఆశ్చర్యపోయేలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. పనిచేసే నాయకులకే ఓటు వేయాలని ..ఎన్నికల్లో గెలిచిన తర్వాత తమ పార్టీ అభ్యర్థులు పనిచేయకపోతే వారిని తొలగిస్తామని కెటిఆర్‌ స్పష్టం చేశారు. ఇంకా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నామని కెటిఆర్‌ చెప్పారు. రాష్ట్రం మొత్తం అబ్బురపడేలా రాజన్న సిరిసిల్ల జిల్లాను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/