థ్యాంక్యూ నుండి ‘ఫేర్ వెల్’ సాంగ్ రిలీజ్

వరుస హిట్ల తో ఫుల్ జోష్ లో ఉన్న నాగ చైతన్య..ప్రస్తుతం ‘థాంక్యూ’ మూవీ తో జులై 22 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విక్రమ్ కె కుమార్ డైరెక్షన్లో దిల్ రాజు బ్యానర్ లో ఈ మూవీ తెరకెక్కింది. విభిన్నమైన ప్రేమకథా చిత్రంగా రాబోతున్న ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతూనే, ప్రమోషన్ కార్య క్రమాలపై మేకర్స్ దృష్టి పెట్టారు. ఇప్పటికే ఈ సినిమాలోని ‘మారో మారో’ మరియు ‘ఏంటో ఏంటేంటో’ అనే రెండు పాటలను విడుదల చేసిన మేకర్స్ ..ఈరోజు ‘ఫేర్ వెల్’ సాంగ్ ను రిలీజ్ చేశారు.

‘అమ్మా నాన్నతో ఓ ఐదేళ్లు.. గల్లీ గ్యాంగ్ తో ఓ ఐదేళ్లు.. హైస్కూల్ మేట్స్ తో ఇంకో ఐదేళ్లు.. ఈ కాలేజ్ బ్యాచ్ తో ఐదేళ్లు..’ అంటూ సాగిన ఈ హృదయపూర్వకమైన గీతం ఆకట్టుకుంటోంది. ప్రతి ఒక్కరి కాలేజ్ డేస్ జ్ఞాపకాలు – ఫేర్ వెల్ పార్టీలను గుర్తు చేసి భావోద్వేగానికి లోనయ్యేలా చేస్తోంది. ఎస్ఎస్ థమన్ బ్యూటీఫుల్ ట్యూన్ సమకూర్చగా.. గీత రచయిత చంద్రబోస్ మనసును హత్తుకునే సాహిత్యం అందించారు. యువ గాయకుడు అర్మాన్ మాలిక్ అద్భుతంగా ఆలపించారు. శేఖర్ మాస్టర్ ‘ఫేర్ వెల్’ సాంగ్ కు కొరియోగ్రఫీ చేశారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాకి బీవీఎస్ రవి కథ అందిస్తుండగా, లెజండరీ కెమెరామెన్ పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.