చరణ్ ఇంట్లో సందడి చేసిన సల్మాన్

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ – రామ్ చరణ్ చాల క్లోజ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. చరణ్ ముంబై కి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా సల్మాన్ ను కలుస్తుంటాడు.ప్రస్తుతం సల్మాన్ కబీ ఈద్ కబీ దీవాళి సినిమాలో నటిస్తున్నాడు. e సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఆ సినిమాలో కీలకమైన గెస్ట్ రోల్ లో వెంకటేష్ నటిస్తున్నాడు. కాగా నిన్న ఆదివారం సల్మాన్..చరణ్ ఇంటికి వచ్చి సందడి చేసాడు.

సల్మాన్ తో పాటు వెంకటేష్ , పూజా హగ్దే లు కూడా రావడం తో మెగా సందడి నెలకొంది. సల్మాన్, పూజా, వెంకీలకు రామ్ చరణ్, ఉపాసన దంపతులు విందు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. ఒకే ఫ్రేమ్ లో ఇంత మంది స్టార్స్ ఉండటంతో పాటు అరుదైన క్లిక్ అవ్వడంతో ఈ ఫోటో పిక్ ఆఫ్ ది డే అన్నట్లుగా నిలిచింది. కొన్నిరోజుల కిందటే సల్మాన్ ఖాన్ మెగాస్టార్ చిరంజీవి ఇంట కూడా ఆతిథ్యం అందుకున్నారు.

ఇక చరణ్ సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా , తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.