మెగా మూవీ లో తమన్నా ఐటెం సాంగ్

మిల్కీ బ్యూటీ తమన్నా మరోసారి ఐటెం సాంగ్ లో చిందులేయబోతుంది. అది కూడా మెగా హీరో మూవీ లో..హ్యాపీ డేస్ మూవీ తో చిత్రసీమలో మంచి గుర్తింపు సాధించిన తమన్నా..ఆ తర్వాత వరుస పెట్టి యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం కొత్త హీరోయిన్ల హావ ఎక్కువగా ఉండడం తో తమన్నా కు ఛాన్స్ లు తగ్గిపోయాయి. ఈ క్రమంలో వెబ్ సిరీస్ , ఐటెం సాంగ్స్ లలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఈ క్రమంలో వరుణ్ తేజ్ నటిస్తున్న గని మూవీ లో ఐటెం సాంగ్ చేసింది.
వరుణ్ తేజ్ హీరోగా డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, అల్లు బాబీ కంపెనీ పతాకాలపై సిద్ధు ముద్ద, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో వరుణ్ బాక్సర్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన విడుదలైన ఫస్ట్‌లుక్‌తో పాటు సినిమాలోని పాత్రలను పరియం చేస్తూ విడుదల చేస్తోన్న పోస్టర్‌లు ‘గని’పై ఆసక్తిని కలిగించాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాలో ”కొడితే” అంటూ సాగే ఐటెం సాంగ్ ను సంక్రాంతి రోజున 11.08 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అనౌన్స్ చేసింది. ఈ సాంగ్ లో మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తున్నట్లు ఓ పోస్టర్ ను కూడా వదిలింది చిత్ర బృందం. ఈ మధ్యనే సమంత సైతం పుష్ప లో ఐటెం సాంగ్ చేసి ఇప్పుడు వైరల్ గా మారింది. మరి తమన్నా కూడా అదే రీతిలో పాపులర్ అవుతుందో చూడాలి.