జగన్ రెడ్డి.. నీ సినిమా అయిపొయింది..

అసలు సినిమా ఇపుడు మొదలవుతోంది: చంద్రబాబు ట్వీట్

Jagan Reddy.. Your movie is over– Chandra babu Tweet

అమరావతి: ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు మరో సారి విరుచుకు పడ్డారు. జగన్ నీ సినిమా అయిపొయింది. అసలు సినిమా ఇపుడు స్టార్ట్ అయిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈమేరకు శుక్రవారం సాయటం బాబు ట్వీట్ చేశారు. జగన్ అమరావతిపై కక్ష గట్టి ఆ ప్రాంతాన్ని సర్వ నాశనం చేశారన్నారు . దీనికోసం కులాల కుంపట్లు రాజేశారని పేర్కొన్నారు. అధికార బలంతో ఉద్యమకారులను చిత్రహింసలకు గురిచేశారని. ఈ కుట్రలను, దారుణాలకు అడ్డం పట్టిన చిత్రం ‘ రాజధాని ఫైల్స్ ‘ అని వెల్లడించారు. రాజధాని కోసం ఎన్నో త్యాగాలు చేసిన ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను ఈ చిత్రం కళ్ళకు కట్టిందన్నారు. ఈ సినిమాను ఆపాలని జగన్ శతవిధాలా ప్రయత్నించారని, కానీ కోర్ట్ ఆ ఆటలను సాగనివ్వలేదన్నారు. సినిమా ప్రదర్శనకు అనుమతి ఇచ్చిందని తెలిపారు. తెలుగు ప్రజలందరూ థియేటర్స్ కు వెళ్లి ఈ సినిమా చూడాలని విజ్ఞప్తి చేశారు. వాస్తవాలను తెలుసుకోండి.. అంటూ ట్వీట్ చేశారు. జగన్ రెడ్డి నీ సినిమా అయిపొయింది.. అసలు సినిమా ఇపుడు మొదలవుతుంది కాస్కో.. అంటూ బాబు ట్వీట్ చేశారు.
చంద్ర బాబు చేసిన ట్వీట్ ఇది..