వకీల్ సాబ్ ఎఫెక్ట్ థమన్‌కు గట్టిగానే పడిందట!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన రీసెంట్ మూవీ ‘వకీల్ సాబ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో పవన్ అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చాడని, సాలిడ్ సక్సెస్ అంటే ఏమిటో మరోసారి బాక్సాఫీస్‌కు చూపించాడని ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమాను దర్శకుడు వేణు శ్రీరామ్ తనదైన శైలిలో తెరకెక్కించగా, ఈ సినిమాకు థమన్ అద్భుతమైన సంగీతం అందించాడు.

అయితే ఈ సినిమాకు సంగీతం అందించిన థమన్‌కు వకీల్ సాబ్ ఎఫెక్ట్ గట్టిగానే పడిందట. ఈ సినిమాను ఏప్రిల్ 30 నుండి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను థియేటర్లలో చూడని వారు ఇప్పుడు ఈ సినిమా చూసి థమన్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారట. ముఖ్యంగా ఈ సినిమాలో థమన్ అందించిన బీజీఎం, పాటలకు పెద్ద ఎత్తు ప్రశంసలు వస్తున్నాయని.. అవి చూసి తనకు చాలా సంతోషంగా ఉందని థమన్ చెప్పుకొచ్చాడు.

బాలీవుడ్‌లో తెరకెక్కిన పింక్ చిత్రానికి రీమేక్‌గా వకీల్ సాబ్ చిత్రం వచ్చిందనే సంగతి తెలిసిందే. పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌తో పవన్ ఈ సినిమాలో లాయర్ పాత్రలో ప్రేక్షకులను మెప్పించాడు. ఇక ఈ సినిమాలో శృతి హాసన్ కేమియో రోల్ చేయగా, నివేథా థామస్, అంజలి, అనన్యాలు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేశారు.