లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. టీడీపీపీ (Telugu Desam Parliamentary Party) నేతల వివరాలను లేఖ ద్వారా స్పీకర్‌కు తెలియజేస్తూ.. లావు శ్రీకృష్ణ దేవరాయలును టీడీపీపీ నేతగా గుర్తించాలని కోరారు.

టీడీపీపీ డిప్యూటీ లీడర్లు, కార్యదర్శి, కోశాధికారి, కార్యాలయ కార్యదర్శుల పేర్లను కూడా లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు చంద్రబాబు లేఖను స్పీకర్ ఓం బిర్లాకు లావు శ్రీకృష్ణ దేవరాయలు, మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, తదితర టీడీపీ ఎంపీలు అందజేశారు.