నాగుల చవితి సందర్బంగా భక్తులతో కిక్కిరిసిపోయిన ఆలయాలు

నేడు నాగుల చవితి సందర్భాంగా భక్తులు పుట్టలో పాలు పోసేందుకు ఉదయం నుండే దేవాలయాలకు క్యూ కట్టారు. ప్రతి ఏటా ఈ పండుగను కార్తీక శుద్ధ చతుర్థి నాడు జరుపుకుంటారు. ఈ ఏడాది కూడా నాగుల చవితిని ఈ రోజు అంటే అక్టోబరు 29, శనివారం నాడు జరుపుకుంటున్నారు. ఈరోజున ప్రజలు ఇంట్లో నాగదేవత విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేస్తారు. మరికొందరు పుట్టవద్దకు వెళ్లి నాగారాధన చేస్తారు. ఈరోజు తెల్లవారుజామున 4 గంటల 18 నిమిషాలకు చవితి తిథి ప్రారంభమవుతుంది. ఇక అక్టోబర్ 29వ తేదీన తెల్లవారుజామున 5 గంటల 13 నిమిషాలకు చవితి ముగుస్తుంది .

ఇక నాగులచవితి రోజున నాగ దేవత ని పూజించడం వల్ల సర్పదోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. ముఖ్యంగా కుజ దోషము, కాలసర్ప దోషాలు ఉన్నవారు నాగులచవితి రోజున, కాలసర్ప దోషానికి అధిపతి అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించుకుంటే మంచి ఫలితాలు వస్తాయని చెబుతారు. చవితి పండుగ రోజున మహిళలు విశేషంగా పుట్టలో పాలు పోసి, ఉపవాస దీక్షను ఆచరిస్తారు. నాగల చవితి పండుగ రోజున అందరూ తమ కుటుంబం సంతోషంగా ఉండాలని, శ్రేయస్సుతో ఉండాలని భావించి నాగ దేవతకు పూజాదికాలు నిర్వహిస్తారు.