డిజిటల్ విధానాలను ప్రజలు ఉపయోగించుకోవాలి

డిజిటల్ ఇండియా 6 వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగం

YouTube video
PM Modi’s speech on 6th anniversary of Digital India Abhiyan

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడి డిజిటల్ ఇండియా వార్షికోత్సవాల సందర్భంగా వివిధ వర్గాల ప్రజలతో గురువారం సంభాషించారు. విద్యార్థుల నుంచి రైతుల వరకు అనేక మంది ఆయనతో మాట్లాడారు. డిజిటల్ విధానాలను ఉపయోగించుకోవడం వల్ల తమ జీవితాలు ఏ విధంగా సుఖవంతమయ్యాయో వివరించారు. సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో టెలిమెడిసిన్‌ను మరింత ఎక్కువ మంది ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నానని తెలిపారు. ఈ-నామ్‌పై రైతుల నమ్మకం పెరగాలన్నారు.

ఉత్తర ప్రదేశ్‌లో దీక్షా పథకం లబ్ధిదారు సుహానీ సాహు మాట్లాడుతూ.. తాను ఐదో తరగతి చదువుతున్నానని చెప్పారు. దీక్ష పథకం వల్ల తన చదువు మరింత ఇంటరాక్టివ్, ఆనందమయం అయిందని చెప్పారు. తమకు వాట్సాప్‌లో ఓ లింక్ వస్తుందని, తాను దీని ద్వారా అనేక విషయాలు నేర్చుకుంటున్నానని తెలిపారు. చాలా కార్టూన్లను కూడా చూడగలుగుతున్నానన్నారు.

ప్రధాని మోదీ స్పందిస్తూ.. ఇటువంటి విషయాలను ఇతర రైతులకు కూడా తెలియజేయాలని కోరారు. ఈ విధంగా అందరు రైతులకు అవగాహన కలిగితే ఈ-నామ్‌పై నమ్మకం పెరుగుతుందన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/