దేశంలోని ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ట్వీటర్ ద్వారా ఉపాధ్యాయులందరికీ ఆయన కృతజ్ఞతలు ప్రకటించారు. జాతికి వారు చేస్తున్న గొప్ప సేవలను ప్రశంసించారు. ‘జాతి నిర్మాణంలో ఉపాధ్యాయులు చాలా కష్టపడుతున్నారు. విద్యార్థుల మనసులను తిప్పడంలోనూ వారి పాత్ర కీలకమే. వారందరికీ కృతజ్ఞతలు ప్రకటిస్తున్నా. గురుపూజా దినోత్సవం సందర్భంగా దేశంలోని ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు. సర్వేపల్లి రాధాకృష్ణణ్కు నివాళులు అర్పిస్తున్నా. మన ఉపాధ్యాయులే మన హీరోలు’ అంటూ ప్రధాని మోడి ట్వీట్ చేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/