ఈ ఏడాది గణేశుడి విగ్రహం ఎత్తు ఎంతో తెలుసా..

విగ్రహం కేవలం 27 అడుగులకు మాత్రమే పరిమితం

Khairatabad Ganesh
Khairatabad Ganesh

హైదరాబాద్‌: హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ఏటా ఏర్పాటు చేసే గణేశుడి విగ్రహానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే కరోనా ప్రభావం ఈసారి గణేశుడిపై కూడా పడింది. ఈఏడాది గణేశుడి విగ్రహం కేవలం 27 అడుగులకు మాత్రమే పరిమితం కానుంది. అంటే విగ్రహం ఎత్తు కిందటి సంవత్సరం కన్నా 38 అడుగుల మేరకు తగ్గనుంది. ఎత్తు తగ్గనున్న నేపధ్యంలో… పూర్తిగా మట్టి విగ్రహాన్నే ప్రతిష్టించాలని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్ణయించింది. ఇక భక్తులు భౌతిక దూరం పాటించేలా వినాయక దర్శనానికి ఏర్పాట్లు చేస్తామని కూడా నిర్వాహకులు చెబుతున్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/