వర్మ ఓ నీచ్, కమీనే, కుత్తేగాడు – నాగబాబు

రామ్ గోపాల్ వర్మ ఫై జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. మొదటి నుండి వర్మ మెగా ఫ్యామిలీ ఫై విమర్శలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఫై నిత్యం వ్యతిరేక ట్వీట్స్ చేస్తూ వస్తున్నారు. మూడు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ – చంద్రబాబు భేటీ తర్వాత వర్మ విమర్శలు ఎక్కువైయ్యాయి. వీరిద్దరి తో పాటు కాపులపై కూడా పలు ట్వీట్స్ చేయడం తో వారంతా ఘాటుగా స్పందిస్తూ వర్మ ను చెప్పుతో కొడతామంటూ ఇప్పటికే హెచ్చరించారు.

ఇదిలా ఉంటె నాగబాబు సైతం వర్మ ఫై ఘాటుగా స్పందించారు. వర్మ అనే వాడు పెద్ద ఎదవ. అలాంటి సన్నాసి.. నీచ్, కమీనే, కుత్తేగాడు ఇండస్ట్రీలో లేడు. వాడు అవసరం కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడు. కాబట్టి వాడి గురించి నేను మాట్లాడను. నేను కాపు సామాజికవర్గంలో పుట్టాను.. కులాన్ని గౌరవిస్తాను.. కులపిచ్చి లేదు. కాపు కులాన్ని ఎంత గౌరవిస్తానో అన్ని కులాలను అంతే గౌరవిస్తాను. కానీ, ఒక కులాన్ని పట్టుకుని నోటికొచ్చినట్టు మాట్లాడితే అతి చాలా పెద్ద తప్పు. చాలా మంది మాట్లాడుతున్నారు. కాపు కులమే కాదు.. ఏ కులమైనా ఎందుకు అమ్ముడుపోతుంది? అంత ఆత్మాభిమానం లేకుండా బతుకుతున్నారా ప్రజలు? అంటే మనుషుల్ని ఎంత చులకనగా చూస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతోంది’’ అని నాగబాబు చెప్పుకొచ్చారు.

కుల అహంకారం ఎంతకు పెరిగిపోయిందో, తలకు ఎంతలా ఎక్కించుకుని చచ్చిపోతున్నారో ప్రస్తుతం అలాంటి మాటలు మాట్లాడేవారిని బట్టి అర్థమవుతోందని నాగబాబు అన్నారు. కాపులు ఆత్మాభిమానం చంపుకుని అమ్ముడుపోయేవారు కాదు. వాళ్లకు చాలా గౌరవం ఉంది. కాపులు ఒక నిర్దిష్టమైన ఆలోచనా విధానం కలిగినవారు. ఇదే కాపులు ఎన్టీ రామారావు గారిని గెలిపించారు. చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని గెలిపించారు. మళ్లీ చంద్రబాబు గారిని గెలిపించారు. మళ్లీ ఈ సో కాల్డ్ అడ్డగాడిదల్లా మాట్లాడే సన్నాసుల్ని గెలిపించారు. అదీ కాపు సామాజికవర్గం నిబద్ధత. కాపు కులాన్ని తాకట్టుపెట్టే హక్కు మాకెక్కడ ఉంది. ఎందుకు అమ్ముతాం అసలు. తాకట్టు అనే దరిద్రపు మాట మీ నోటి నుంచే వస్తోంది. మీరు ఒక మురికి కుంట, దాని నుంచి ఏ దరిద్రమైనా వస్తుంది. మేం ఏ కమ్యూనిటీని అమ్ముకోం. జనాన్ని గౌరవిస్తాం అని నాగబాబు వెల్లడించారు.