సీఏఏకు వ్యతిరేక తీర్మానానికి శాసనసభ ఆమోదం

కేంద్రం దీనిపై పునరాలోచన చేయాలన్న సిఎం కెసిఆర్‌

Telangana Assembly Session
Telangana Assembly Session

హైదరాబాద్‌: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను వ్యతిరేకిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం లభించింది. సీఏఏపై మొదటి నుంచి వ్యతిరేక గళం వినిపిస్తున్న సిఎం కెసిఆర్‌ సర్కారు చట్టసభలో దీనిపై పంతం నెగ్గించుకుంది. సీఏఏ వ్యతిరేక తీర్మానం సందర్భంగా జరిగిన చర్చలో సిఎం కెసిఆర్‌ మాట్లాడుతూ, సరైన పత్రాలు లేని ప్రజలు కోట్లలో ఉన్నారని, ఇకనైనా కేంద్రం సీఏఏపై పునరాలోచన చేయాలని హితవు పలికారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/