జాతీయజెండాను ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ

రాష్ట్ర ఆవిర్భావంతో ప్రగతి పథంలో తెలంగాణ

Minister Puvvada

ఖమ్మం: నేడు 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర ఆవిర్భావంతో ప‌ల్లెలు ప్రగతి పథంలో ప‌య‌నిస్తున్నాయ‌ని అజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావం త‌ర్వాత తెలంగాణ ప్రగతిని చూసి అనేక రాష్ట్రాలు సిఎం కెసిఆర్‌ పథకాలను కాపీ కొడుతున్నారన్నారు. ముఖ్యంగా గ్రామాల రూపు రేఖ‌లే మారిపోయాయ‌న్నారు. ఒక‌ప్పుడు గ్రామాల్లో మంచినీటిని, విద్యుత్‌ను సరఫరా చేయడమే కష్టంగా మారేదని, సర్పంచ్‌ల ఐదేండ్ల కాలం వీటికే సరిపోయేదన్నారు. కానీ, నేటి ప‌రిస్థితి ఇందుకు భిన్నంగా ఉంద‌న్నారు. అన్ని గ్రామాల్లో అనేక విధాలుగా అభివృద్ధి జరుగుతున్నద‌ని చెప్పారు. కాగా కరోనా మహమ్మారి కారణంగా వేడకలు నిరాడంబరంగా నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని సూచించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/