ప్రగతి భవన్‌లో జాతీయపతాకం ఆవిష్కరించిన కెసిఆర్‌

cm kcr

హైదరాబాద్‌: తెలంగాణ సిఎం కెసిఆర్‌ 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో జాతీయజెండాను ఆష్కరించి గౌరవ వందనం చేశారు. అంతకుముందు ఆయన మహనీయుల చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. దేశానికి వారి చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఆయన వెంట పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/