జాతీయ పండుగగా మేడారం జాతరను ప్రకటించాలి

రాజ్యసభ జీరో అవర్‌లో మాట్లాడిన ఎంపి బండా ప్రకాశ్‌

MP Banda Prakash
MP Banda Prakash

న్యూఢిల్లీ: తెలంగాణలోని మేడారం జాతరకు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి ఉందని ఎంపి బండా ప్రకాశ్‌ తెలిపారు. రాజ్యసభలో జీరో అవర్ లో బండా ప్రకాశ్ మాట్లాడారు. మేడారం జాతరను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందన్నారు. మేడారంలో కేంద్ర ప్రభుత్వం ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని కోరారు. మేడారం అభివృద్ధికి కేంద్రం రూ.1000 కోట్లు కేటాయించాలని అడిగారు. కాగా ఇప్పటికే మేడారం జాతరకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను తెలంగాణ ప్రభుత్వం చేసింది. మేడారం చేరుకునే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని జాగ్రతలు తీసుకుంది. ప్రత్యేక బస్సులు, రైళ్లు మరియు ప్రత్యేక హెలికాప్టర్‌ సేవలను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఫిబ్రవరి 5 తేదీ నుంచి ఫిబ్రవరి 8 వరకు ఎంతో వైభవంగా జరగనుంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/