ప్రపంచానికే రోల్‌ మోడల్‌ మహాత్మాగాంధీ

somireddy chandramohan reddy
somireddy chandramohan reddy

అమరావతి: శాంతి, అహింసకు ప్రపంచానికే రోల్‌ మోడల్‌ మహాత్మాగాంధీ అని టిడిపి టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు. దేశం కోసం ప్రాణాత్యాగం చేసిన మహానుభావుడు అని అన్నారు. ప్రపంచస్థాయిలో దేశానికి గుర్తింపు తెచ్చిన జాతిపితను కించపరచడమంటే దేశస్థాయిని తగ్గించుకోవడమేనని విమర్శించారు. గాంధీని అవమానించేలా మాట్లాడిన వారిని పార్టీల నుంచి కాదు సమాజం నుంచి వెలివేయాలని సోమిరెడ్డి దుయ్యబట్టారు. కాగా మహాత్మా గాంధీ వల్లే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని కాంగ్రెస్‌ నేతలు పదే పదే చెబుతారని, అయితే సత్యాగ్రహాల వల్ల బ్రిటిష్‌వారు దేశాన్ని వదిలిపోలేదని, వారు విసిగిపోయి మనకు స్వాతంత్ర్యం ఇచ్చారని బిజెపి ఎంపీ అనంత్‌ కుమార్‌ హెగ్డే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో సోమిరెడ్డి బిజెపి ఎంపీ అనంతకుమార్‌పై పరోక్ష విమర్శలు చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/