రేవంత్‌ రెడ్డికి షాకిచ్చిన కొడంగల్‌ మున్సిపాలిటీ

Revanth Reddy
Revanth Reddy

వికారాబాద్: కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డికి కొడంగల్ లో షాక్ తగిలింది. కొడంగల్ మున్సిపాలిటీలో టిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం 12వార్డుల్లో ఇప్పటివరకు 8 స్థానాల్లో టిఆర్ఎస్ ఘన విజయం సాధించింది. రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రచారం చేసిన ఫలితం లేకపోయింది. కేవలం 3వార్డుల్లోనే కాంగ్రెస్ విజయం చేసుకుంది. అటు నల్లొండ జిల్లాలోని చిట్యాల మున్సిపాలిటీని కాంగ్రెస్ కూటమి కైవసం చేసుకుంది. భువనగిరిలో కాంగ్రెస్ 15, టిఆర్ఎస్ 12 మధ్య హోరాహోరీగా కొనసాగుతోంది. అటు ఉమ్మడి వరంగల్ ను టిఆర్ఎస్ పార్టీ క్లీన్ స్విప్ చేసింది. ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతోంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/