మెదక్‌, ఖమ్మం, నల్లగొండ ఎమ్మెల్సీ స్థానాలలో తెరాస విజయం

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస దూకుడు కనపరుస్తుంది. నల్గొండ, ఖమ్మం తో పాటు మెదక్ లలో కూడా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. ఖమ్మం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తాత మధు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 238 ఓట్ల మెజార్టీతో మధు గెలుపాందారు. ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో 12 చెల్లని ఓట్లు ఉన్నాయి. మిగతా వాటిలో టీఆర్‌ఎస్‌కు 480, కాంగ్రెస్‌కు 242 ఓట్లు పోలవగా.. స్వతంత్ర అభ్యర్థికి కేవలం 4 ఓట్లే వచ్చాయి.

మెదక్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి యాదవరెడ్డి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌ అభ్యర్థికి 238 ఓట్లు పోల్ అవ్వగా..యాదవరెడ్డికి 762 ఓట్ల వచ్చాయి.స్వతంత్ర అభ్యర్థికి కేవలం ఆరు ఓట్లే వచ్చాయి. మెదక్‌ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 12 ఓట్లు చెల్లనివిగా తేలాయి. నల్లగొండలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కోటిరెడ్డి ఘనవిజయం సాధించారు. తొలి ప్రాధాన్యతా ఓట్లలో ఆయనకు భారీ మెజార్టీ వచ్చింది. నల్లగొండలో మొత్తం 1271 ఓట్లకుగానూ 1233 ఓట్లు పోలయ్యాయి. కోటిరెడ్డికి ఏకంగా 917 ఓట్లతో విజయం సాధించారు. తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడనున్నాయి. ఈ నెల10వ తేదీన నిర్వహించిన ఎమ్మెల్సీ పోలింగ్ ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు పూర్తిస్థాయి ఫ‌లితాలు వెల్లడయ్యే చాన్స్ ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు కౌంటింగ్ కేంద్రాల వ‌ద్ద పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు గోయల్ పేర్కొన్నారు.