బిఎస్‌ఎన్‌ఎల్ రిపబ్లిక్ డే ఆఫర్
రూ.1999 ప్రీపెయిడ్ ప్లాన్ చెల్లుబాటును ఇప్పుడు 71 రోజుల పాటు పెంచింది

న్యూఢిల్లీ: ఇండియాలో జనవరి 26న జరగబోయే 71 వ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ తన చందాదారులకు భారీ ఆఫర్ ను అందిస్తోంది. బిఎస్‌ఎన్‌ఎల్ రూ.1,999 ప్రీపెయిడ్ ప్లాన్ చెల్లుబాటును ఇప్పుడు 71 రోజుల పాటు పెంచింది. ఈ ప్లాన్ చెల్లుబాటు కాలం 436 రోజులు అవుతుంది. బిఎస్‌ఎన్‌ఎల్ అందిస్తున్న రూ.1,999 ప్రీపెయిడ్ ప్లాన్ సాధారణంగా 365 రోజుల చెల్లుబాటుతో అన్ని రకాల ప్రయోజనాలను అందిస్తుంది. రిపబ్లిక్ డే కనుకగా కంపెనీ రూ.1,999 ప్లాన్ చెల్లుబాటును మరొక 71 రోజుల పాటు పొడిగించింది. ఈ ఆఫర్ లో భాగంగా ఈ ప్లాన్ 436 రోజుల పాటు యాక్సిస్ ను అందిస్తుంది. దీంతో వినియోగదారులు ప్రతిరోజూ 250 నిమిషాల వాయిస్ కాలింగ్, 3 జిబి రోజువారీ డేటాతో పాటు రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్ లభిస్తాయి. ఈ ఆఫర్ 2020 జనవరి 26 నుండి 2020 ఫిబ్రవరి 15 వరకు మాత్రమే ఉంటుంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/