వైద్య ఆరోగ్య, పోలిస్‌ శాఖలకు పూర్తి వేతనాలు

ఉత్తర్వులు జారీ చేసిన ఆర్ధిక శాఖ

stethascope
stethascope

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్‌ శాఖల ఉద్యోగులకు పూర్తి వేతనం చెల్లిస్తు రాష్ట్ర ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలొ లాక్‌డౌన్‌ కొనసాగుతుండడంతో ఆర్ధిక పరిస్థితి బాగా దెబ్బతింది. ఈ కారణంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాని కరోనాని కట్టడి చేసేందుకు పోలిస్‌, వైద్యశాఖల అధికారులు, నిరంతరాయంగా పనిచేస్తున్నందుకు వారికి పూర్తి వేతనాలు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. దీంతో వారికి పూర్తి వేతనాలు ఇచ్చేలా ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/