సంగారెడ్డిలో ఆరుగురికి కరోనా పాజిటివ్‌

corona virus
corona virus

సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుంది. కొద్దిసేపటి క్రితం సంగారెడ్డిలో ఆరుగురికి కరోనా సోకినట్లు నిర్దారణ అయింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ మంత్రి హరీష్‌ రావు, ఎంపి కొత్త ప్రభాకర్‌ రెడ్డిలు హుటాహుటిన సంగారెడ్డికి వెళ్లారు.వెంటనే కలెక్టర్‌తో సమీక్ష నిర్వహించారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన ఆరుగురిని ,చికిత్స కోసం తరలించగా.. వారి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌లో ఉంచారు. గత కొద్ది రోజులుగా వీరు ఎవరెవరిని కలిశారో అధికారులు ఆరా తీస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/