అనేక రాంగాల్లో తెలంగాణ దూసుకుపోతుంది

జాతి నిర్మాణంలో తెలంగాణ కీలక భూమిక పోషిస్తుంది

cm kcr
TS CM KCR

హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో సిఎం కెసిఆర్‌ మాట్లాడుతూ..తెలంగాణ తనకు తాను పునర్ నిర్మాణం చేసుకోవడమే కాదు.. జాతి నిర్మాణంలోనూ కీలక భూమిక పోషిస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. ఙఅనేక రంగాల్లో తెలంగాణ దూసుకుపోతోంది. కాగ్ ఇచ్చిన లెక్కలనే మేం శాసనసభలో సమర్పించాం. మంచిని మంచి అని మెచ్చుకునే సంసృతి కాంగ్రెస్ పార్టీకి లేదు. మీది రాజకీయ పార్టీ అయితే.. మాది మఠమా..?. ప్రతిపక్షాలు సబబుగా మాట్లాడితే సబబైన సమాధానమే వస్తుంది. రాజకీయంగా మాట్లాడితే రాజకీయ సమాధానమే వస్తది. తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్. ఆరోజు తుమ్మళ్లు మొలచిన కాలువల్లో ఆవాళ్ల నీళ్లు పారుతున్నాయి.

కాకతీయ కాల్వలు సజీవంగా పారుతుంటే ప్రజలకు కన్పిస్తుంది కానీ, కాంగ్రెస్ నాయకులకు కనిపించడంలేదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్నరా. కాంగ్రెస్, టిడిపి హయాంలో పెన్షన్ల పరిస్థితి ఘోరంగా ఉండేది. రాష్ట్ర ఆర్థిక స్థితి బాగా లేకుంటే ఇన్ని సంక్షేమ పథకాలు అమలయ్యేవా. మేనిఫెస్టో రూంపొందించే సమయంలో నేను పట్టుబట్టి పెన్షన్ వెయ్యి చేశాను. పెన్షన్ వెయ్యి చేయ్యడమే కాదు కచ్చితంగా అమలు చేశాం. మానవతా హృదయంతో రూ.వెయ్యి ఉన్న పెన్షన్ ను రూ.2 వేలు చేశాం. ఏదో ఒక మారుమూల గ్రామానికి నీళ్లు రాకుంటే మొత్తం భగీరథ దండుగ అన్నట్లు మాట్లాడటం సరికాదు. కళ్యాణలక్ష్మీ మా ఎన్నికల వాగ్దానం కాదు.. అయినా లక్ష నూటపదహారు ఇస్తున్నం. విజయ డెయిరీని ఆదుకొని లాభాల్లోకి నడిపించాం. రూ.30 కోట్ల నష్టాల్లో ఉన్న విజయ డెయిరీని ఆదుకున్నం. పాడిపశువులను పెంచుకునే సంస్కారం లేక గత ప్రభుత్వాలు.. విజయ డెయిరీని నాశనం చేశాయి. మహారాష్ట్ర, కర్నాటక డెయిరీల నుంచి పాలను సేకరించేవారు. స్మశానంలా మారిన విజయడెయిరీ కళకళలాడుతున్నయాన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/