హైదరాబాద్‌: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

Road accident in guntur
Road accident in guntur

హైదరాబాద్‌: నగరంలోని కర్మన్‌ఘాట్‌ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు చెట్టును ఢీకొట్టడంతో… ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. కారు తుక్కుతుక్కైంది. ముందున్న బానెట్ పూర్తిగా నాశనమైంది. దీన్ని బట్టీ కారు చెట్టును ఢీకొట్టిన సమయంలో… దాదాపు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు. ఘటనా స్థలికి వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేశారు. చట్టపరంగా దీనిపై ముందుకెళ్తామన్నారు. ఇటీవల ఇలాంటి రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిలో చాలా మంది ప్రాణాలు కోల్పోతుండటం విషాదకరం. అయితే రేపు గుజరాత్… అహ్మదాబాద్‌కి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వస్తున్నారు. ఇలాంటి సమయంలో… ఎలాంటి రోడ్డు ప్రమాదాలు, టెన్షన్లూ లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచీ ఆదేశాలు వచ్చాయి. ఆ క్రమంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంపై అధికారులు వేగంగా చర్యలు చేపడుతున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/