బహుబలిలా మారిన ట్రంప్‌.. వీడియో వైరల్‌

ఇండియాలో తనకు గొప్ప స్నేహితులు ఉన్నారన్న ట్రంప్

Donald Trump
Donald Trump

వాషింగ్టన్‌: ‘బాహుబలి’ లా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కనిపిస్తే… అదే వీడియోలో ఇతర పాత్రల్లో ఇవాంకా ట్రంప్, మెలానియా తదితరులు ఉంటే… ఆ వీడియోనే ఇది. ఎవరో సృష్టించిన ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఖిబాహుబలి: ది బిగినింగ్ , బాహుబలిఖి, ఖిది కన్‌ క్లూజన్‌ఖిగా వచ్చిన ఈ సినిమా భారతీయ చలన చిత్ర రికార్డులను తిరగరాసిన సంగతి తెలిసిందే. సుమారు రూ. 2 వేల కోట్ల కలెక్షన్స్ సాధించి, ఇండియన్ సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి పెంచింది. ఇక రేపటి నుంచి ఇండియాలో ట్రంప్ పర్యటన ప్రారంభం కానుండగా, ‘బాహుబలి’ టైటిల్ సాంగ్‌ తో ఓ వీడియోను తయారు చేశారు. సుమారు నిమిషం 20 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ప్రభాస్, రానాల ముఖాలకు ట్రంప్ ముఖాన్ని అతికించి బ్యాక్‌ గ్రౌండ్‌ లో ‘జియోరే బాహుబలి’ పాటను జోడించారు. ఇక ఈ వీడియోలో మెలానియా, ఇవాంకాలతో పాటు ట్రంప్ కుమారుడు కూడా కనిపిస్తున్నారు. చివర్లో ‘యుఎస్ఏ అండ్ ఇండియా యునైటెడ్’ అన్న క్యాప్షన్ కూడా ఉంది. ఈ ట్వీట్ పై ట్రంప్ స్వయంగా స్పందిస్తూ, ఇండియాలో తనకు గొప్ప స్నేహితులు ఉన్నారు అని రీ ట్వీట్ చేయడం విశేషం. ఆ వీడియోను మీరూ చూడండి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/