బయోడైవర్సీటీ ఫ్త్లెఓవర్‌ పున:ప్రారంభం

ఫ్లైఓవర్‌పై సెల్ఫీలు దిగితే జరిమానా విధిస్తాం

biodiversity flyover
biodiversity flyover

హైదరాబాద్‌: బయోడైవర్సిటీపై కారు ప్రమాదం జరిగిన తర్వాత 43 రోజుల పాటు ప్లై ఓవర్‌ను మూసేశారు. కాగా నేటి నుంచి వాహనాల రాకపోకలను మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పున:ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ వంతెన నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేవన్నారు. నిపుణుల కమిటీ సూచనల మేరకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఇక్కడ మంచి వాతావరణం ఉండటంతో కొందరు సెల్ఫీలు దిగుతున్నారని, సెల్ఫీలు దిగకుండా సైడ్‌ వాల్స్‌ ఏర్పాటు చేశామని మేయర్‌ తెలిపారు. సెల్ఫీలు దిగితే జరిమానా విధిస్తామన్నారు. ఇక్కడ సీసీ కెమెరాలు, స్పీడ్‌ బ్రేకర్లును ఏర్పాటు చేశామని తెలిపారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చయండి:https://www.vaartha.com/news/sports/