ఇరాన్‌ మీదుగా భారత్‌ విమానాలు వద్దు

విమానయాన సంస్థలకు భారత ప్రభుత్వం ఆదేశాలు

air india
air india

న్యూఢిల్లీ: ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుపై అమెరికా రాకెట్ దాడులు చేసిన విషయం తెలిసిందే. తీవ్ర ప్రతీకార దాడి తప్పదని ఇరాక్, ఇరాన్ ప్రకటన చేసినా లెక్కచేయకుండా అమెరికా మరోసారి దాడి చేసింది. దీంతో పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు అలముకున్నాయి. దీంతో విమానయాన సంస్థలకు భారత ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇరాన్‌ గగనతలానికి దూరంగా ఉండాలని సూచించినట్లు తెలిసింది. ఎయిరిండియా, ఇండిగో వంటి సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టినట్లు సమాచారం. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. భారత్‌ నుంచి అమెరికా, పశ్చిమాసియా, యూరప్‌ వెళ్లే విమానాలను విమానయాన సంస్థలు తాత్కాలికంగా దారి మళ్లించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల విమానయాన సంస్థలపై అదనపు భారం పడుతుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/