మళ్లీ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించిన ఉత్తర కొరియా

North Korea fires cruise missiles, says South Korean military

సియోల్‌: ఉత్తర కొరియా వరుస క్షిపణి ప్రయోగాలతో కొరియన్‌ పీఠభూమిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాజాగా మరోసారి పలు క్రూయిజ్‌ క్షిపణులను ప్రయోగించింది. శనివారం కొరియా ద్వీపకల్పానికి పశ్చిమాన ఉన్న సముద్రం వైపు ఉత్తర కొరియా పలు క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్‌ యోన్‌హాప్ చెప్పారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 4 గంటలకు ఈ ప్రయోగాలు జరిగినట్లు చెప్పారు. దీంతో కొరియా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

కాగా, బుధవారం ఉదయం ఉత్తర కొరియా రెండు బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించిన విషయం తెలిసిందే. అవి జపాన్‌ సముద్రంలో పడినట్లు దక్షిణ కొరియా సైన్యం ధ్రువీకరించింది. అమెరికా అణు జలాంతర్గామి దక్షిణ కొరియాకు వెళ్లిన నేపథ్యంలో ప్యాంగాంగ్‌ వరుసగా క్షిపణులను ప్రయోగిస్తున్నది.