శంషాబాద్‌ విమానాశ్రయంలో బంగారం స్వాధీనం

Rajiv Gandhi International Airport
Rajiv Gandhi International Airport

శంషాబాద్‌: కస్టమ్స్‌ అధికారులు ఎంత ప్రయత్నించినా అక్రమంగా బంగారాన్ని తరలించే వారి ఆట కట్టించలేకపోతున్నారు. ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ అధికారులు కళ్లుగప్పి బంగారాన్ని అక్రమ రవాణా చేస్తూనే ఉన్నారు. తాజాగా మరో ఘటన హైదరాబాద్‌ లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో శనివారం కస్టమ్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో దోహా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను తనిఖీ చేయగా.. వారి వద్ద 600 గ్రాముల బంగారం గుర్తించి, స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత ఇద్దరి నిందితులను అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు తరలించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/