రెండు వారాల వ్యవధిలో 500 కేసులు

గ్రేటర్ హైదరాబాద్ పై కరోనా పంజా

Corona posiitive cases updates
Corona posiitive cases updates

Hyderabad: గ్రేటర్‌ హైదరాబాద్‌పై కరోనా పంజా విసురుతోంది. విశ్వనగరం హైదరాబాద్‌పై కరోనా వైరస్‌ తన విశ్వరూపాన్ని చూపుతోంది.

కేవలం రెండు వారాలు(14రోజుల్లోనే) 500 పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

తెలంగాణ వ్యాప్తంగా అత్యధిక కేసులు గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే నమోదు అవుతుండడం ప్రభుత్వాన్ని, ప్రజలను బెంబేళెత్తిస్తోంది.

తాజాగా ముగ్గురు పోలీసులకు కూడా కరోనా సోకడం ప్రమాద ఘంటికలను మోగిస్తోంది.

శుక్రవారం రాష్ట్రంలో 62మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా, ఇందులో 42 కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనివే.

జీహెచ్‌ఎంసీ పరిధిలో గత 14రోజుల్లో కేసుల ఉధృతిని ఒకసారి పరిశీలిస్తే మే 9న 30 కేసులు, మే 10న 26 కేసులు నమోదయ్యాయి.

మే 11మాత్రం అత్యధికం గా 79పాజిటివ్‌ కేసులు వచ్చాయి.

మొత్తంగా రెండు వారాల్లో కలిపి ఏకంగా 500 కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే నమోదు కావడంతో అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించారు.

తాజా ‘మొగ్గ’ (చిన్నారుల ప్రత్యేకం) కోసం : https://www.vaartha.com/specials/kids/