నేడు నూతన ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం

TELANGANA LEGISLATIVE COUNCIL
TELANGANA LEGISLATIVE COUNCIL

హైదరాబాద్‌: గవర్నర్‌ కోటాలో ఎంపికైన ముగ్గురు ఎమ్మెల్సీలు ఈరోజు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రముఖ కవి, గాయకుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్‌లను గవర్నర్‌ కోటాలో ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా నామినేట్‌ చేసింది. వీరి పేర్లను గవ‌ర్నర్‌ తమి‌ళిసై సౌంద‌ర‌రా‌జన్‌ ఆమో‌దించారు. దీంతో వారు ఈరోజు ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ముగ్గురు ఎమ్మెల్సీల నియామకంతో మండలిలో మొత్తం 40 స్థానాలు భర్తీ అయ్యాయి. కాగా, మండలికి ఎన్నికైన తొలి కవిగా గోరటి వెంకన్న గుర్తింపు పొందారు. ప్రమాణస్వీకారం అనంతరం వారు జీహెచ్‌ఎంసీలో ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా తమ పేర్లను నమోదుచేసుకోనున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/