స‌మ్మె విర‌మించిన తెలంగాణ‌ వీఆర్ఏలు..

గత 80 రోజులుగా సమ్మె చేస్తున్న తెలంగాణ వీఆర్ఏలు ఎట్టకేలకు సమ్మె విరమించారు. బుధువారం వీఆర్ఏల ప్రతినిధులు, ట్రెసా నేతలతో సీఎస్ సోమేశ్‌ కుమార్ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా వారితో జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. ఈ సమావేశంలో వీఆర్ఏల సమస్యలు, డిమాండ్లపై చర్చించారు. పే స్కేలు అమలు చేయాలనీ , అలాగే పదోన్నతులు ఇవ్వాలని, వయసు పైబడిన వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని వీఆర్ఏ ప్రతినిధులు సీఎస్ ను కోరారు.

వీరి కోర్కెలను విన్న సీఎస్ సానుకూలంగా స్పందించి వారి ప్ర‌తిపాద‌న‌ల‌కు అంగీక‌రించారు. దీంతో వెంటనే వారు స‌మ్మె విర‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వీఆర్ఏలు రేపట్నుంచి విధులకు హాజరవుతారని ట్రెసా అధ్యక్షుడు తెలిపారు.80 రోజులుగా వీఆర్ఏలు సమ్మె చేస్తున్నారని ఐకాస ప్రతినిధులు పేర్కొన్నారు. సీఎస్ సోమేష్‌కుమార్ వీఆర్ఏల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ఐకాస ప్రతినిధులు తెలిపారు. రేపట్నుంచి విధుల్లో చేరుతామని వీఆర్‌ఏ ఐకాస ప్రతినిధులు వెల్లడించారు.