వారాహి కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ రవాణా శాఖ ..వారాహి నెం ఇదే..

జనసేన ప్రచార రథం వారాహి కి తెలంగాణ రవాణా శాఖ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. వారాహి వాహనానికి రవాణా శాఖకు సంబంధించిన అన్ని అనుమతులు ఉన్నాయని, వారం రోజుల క్రితమే వారాహి వాహనం రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకుందని తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పాపారావు వెల్లడించారు. అంతే కాదు వాహనం బాడీకి సంబంధించిన సర్టిఫికెట్ ను పరిశీలించామని ..వారాహి కి TS 13 EX 8384 నెంబరు కేటాయించినట్టు తెలిపారు.

గత ఎన్నికల్లో ఓటమి చెందిన పవన్..ఈసారి గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్నారు. గతంలో చేసిన పొరపాట్లు మరోసారి చేయకుండా..పక్క ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు. గతంతో పోలిస్తే పవన్ కళ్యాణ్ కు జనాల్లో ఆదరణ పెరగడమే కాదు జనసేన ఫై నమ్మకం సైతం రెట్టింపు అయ్యింది. ఒక్కసారి పవన్ కళ్యాణ్ కు కూడా ఛాన్స్ ఇచ్చి చూద్దాం అని ప్రజలు అంటున్నారు.

ఇక ఎన్నికలకు ఇంకా ఏడాది పైగానే సమయం ఉన్నప్పటికీ అన్ని పార్టీలు ఇప్పటి నుండే జనాల్లోకి వెళ్తూ..నమ్మకం పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ సైతం బస్సు యాత్ర తో జనాల్లోకి వెళ్ళబోతున్నారు. దసరా తర్వాత బస్సు యాత్ర చేపట్టాలని అనుకున్నారు కానీ కుదరలేదు. త్వరలోనే బస్సు యాత్ర చేపట్టాలని చూస్తున్నారు. ఈ క్రమంలో పవన్ ప్రచార రథం కూడా సిద్ధమైంది. దీనికి సంబంధించిన ట్రయల్ రన్ వీడియో, ఫొటోలను పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో పంచుకున్నారు. ఈ బస్సుకు ‘వారాహి’ అని పేరుపెట్టినట్టు పవన్ వెల్లడించారు.

‘వారాహి’ఈజ్‌ రెడీ ఫర్‌ బ్యాటిల్‌ అని ఎప్పుడైతే సోషల్‌ మీడియాతో ఫోటోలు పెట్టారో.. అప్పటి నుంచి బస్‌ యాత్ర వాహనం చుట్టూ వివాదాలు అల్లుకున్నాయి. వారాహి కలర్ మీద వైస్సార్సీపీ నేతలు పెద్ద ఎత్తున హడావిడి చేసారు. ఒకానొక టైం వారాహీకి రిజిస్ట్రేషన్ కూడా కాదని కామెంట్స్ చేసారు. కానీ వారాహి కి రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యింది. మరి ఇప్పుడు వైస్సార్సీపీ నేతలు ఏమంటారో అని జనసేన నేతలు కామెంట్స్ వేస్తున్నారు.