గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం

YouTube video
PM Modi attends swearing-in ceremony of new Gujarat government, at Sachivalaya Helipad Ground

అహ్మాదాబాద్ః భూపేంద్ర పటేల్ గుజరాత్ సీఎంగా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్ , భూపేంద్ర పటేల్ తో ప్రమాణం చేయించారు. మంత్రులుగా హర్ష సంఘవి, జగదీష్ విశ్వకర్మ, నరేష్ పటేల్, బచుభాయ్ ఖబద్, పర్షోత్తమ్ సోలంకి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని మోడీ, అమిత్ షా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్, బిజెపి చీఫ్ జేపీ నడ్డా, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, త్రిపుర రాష్ట్రాల సీఎంలు, స్మృతి ఇరాని, పలువురు బిజెపి నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

కాగా, ఈ నెల 1, 5 తేదీల్లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి భారీ విజయం సాధించింది. 182 స్థానాల్లో పోటీ చేసి 156 సీట్లలో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 17, ఆప్ 5 స్థానాలు గెలుచుకుంది. దీంతో భూపేంద్ర పటేల్ ఈరోజు రాష్ట్ర 18వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/