మేం అందుకు భయపడలేదు

Uttam Kumar Reddy
Uttam Kumar Reddy

హైదరాబాద్‌: ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ భయపడలేదని టిపిసిసి చైర్మన్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. ఆయన ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడుతూ..మున్సిపల్ ఎన్నిలను తాము వాయిదా వేయమని కోరలేదని చెప్పారు. తామేదో ఎన్నికలకు భయపడి వాటిని వాయిదా వెయ్యాలని కోరుతూ కోర్టుకు వెళ్లారని విమర్శించడం తగదన్నారు. తాము ప్రతి విమర్శలు చేయగలమంటూ ఉత్తమ్ పేర్కొన్నారు. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన రోజే… వార్డు రిజర్వేషన్స్ కు, నామినేషన్స్ తొలి రోజుకు మధ్య ఒక వారం రోజులు ఉండాలని వినతి చేశామన్నారు. కానీ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎందుకు తొందర పడ్డారో అర్థం కాలేదని వ్యాఖ్యానించారు. వార్డు రిజర్వేషన్స్ ప్రకటనకు, నామినేషన్లకు మధ్య ఒక్కరోజే ఉండటంతో.. రిజర్వేషన్ల ప్రకటన వెనక్కి తీసుకుపోవడమో లేదా నామినేషన్లను ముందుకు జరపడమో చేయాలని కోరామని వివరించారు. నేరేడుచర్లలో అధికార దుర్వినియోగం జరిగిందన్నారు. తెలంగాణలో న్యాయస్థానంపై ప్రజల విశ్వాసం తగ్గిపోతోందని ఉత్తమ్ పేర్కొన్నారు. లోక్ సభలో మాట్లాడానికి స్పీకర్ కు తాను లేఖ రాశానన్నారు. ఈ విషయంలో కొన్ని విషయాలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళతామని చెప్పారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/