రాష్ట్ర ప్రభుత్వం ప్రాంతీయ విభేదాలను సృష్టిస్తుంది

సీఎం జగన్‌ ఏ నిర్ణయం తీసుకున్నా అమరావతి రైతులకు అన్యాయం జరగకుండా చూడాలి

ayyanna patrudu
ayyanna patrudu

తిరుపతి: రాష్ట్రంలో పాలన ఎలా ఉందంటే 13 జిల్లాలో విభేదాలు లేకపాయినా రాష్ట్ర ప్రభుత్వమే విభేదాలను సృష్టిస్తుందని టిడిపి నేత అయ్యన్న పాత్రుడు అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా అమరావతి రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని ఆయన కోరుకున్నారు. మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో తిరుమల శ్రీవారిని అయ్యన్నపాత్రుడు దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ…ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రాంతీయ విభేదాలను సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని ఆయన విమర్శించారు. ఈ రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా చేసి ప్రాంతీయ విభేదాలు సృష్టించడం మంచిది కాదని అయ్యన్న పాత్రుడు సూచించారు. ప్రతి జిల్లా ప్రజలు వారి జిల్లా అభివృద్ధి చెందాలని కోరుకుంటారని అన్నారు. ఇంకా శ్రీ వెంకటేశ్వర స్వామివారే అనుగ్రహించి ఈ రాష్ట్రా ముఖ్యమంక్రి జ్ఞానోదయం కలిగించాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/